కరోనా ఎఫెక్ట్ – అగ్ర హీరోల స్టార్డం పెద్ద రిస్క్ లో పడనుందా?

కరోనా ఎఫెక్ట్ – అగ్ర హీరోల స్టార్డం పెద్ద రిస్క్ లో పడనుందా?

Published on Sep 23, 2020 2:05 PM IST

ఈ ఏడాది పరిస్థితులు అన్నీ ఒక్కసారిగా ఊహించని విధంగా మారిపోయాయి. దీనితో ఎంతో మంది కార్మికుల జీవితాలు తలకిందులు అయ్యిపోయాయి. ప్రపంచ దేశాలతో పాటు మన దేశంలోకి కూడా సైలెంట్ గా ఎంటర్ అయిన కరోనా ప్రభావం ఇప్పటి వరకు కూడా తగ్గకపోవడంతో ఒక్కసారిగా అన్ని రంగాల్లో పెను విప్లవంగా ఎన్నో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా సినీ పరిశ్రమలో అయితే మరింత స్థాయిలో దీని ప్రభావం పడింది. ఇప్పటి వరకు ఈ కరోనా ప్రభావం కేవలం సినీ రంగంపైనే ఇంకా అలా కొనసాగుతుంది.

ఒక వేళ భవిష్యత్తులో అయినా మాములుగా ఉంటుందా అంటే అది కూడా ఒక అర్ధం కానీ ప్రశ్నగానే మారిపోతుందేమో అనిపిస్తుంది. దీని మూలాన సినిమా రంగానికి అత్యంత కీలకం అయినటువంటి స్టార్ హీరోల స్టార్డం పరిస్థితి ఏమిటి అన్న సరికొత్త ప్రశ్న లేవనెత్తుతుంది. మాములు పరిస్థితుల్లో ఒక పెద్ద హీరో సినిమా వస్తుంది అంటే ఆ హడావుడే మరోస్థాయిలో ఉంటుంది. ముఖ్యంగా పండుగ సీజన్ వచ్చింది అంటే ఫ్యామిలీ అండ్ హీరోల అభిమానులకు మరో పెద్ద పండుగ వచ్చినట్టే అని చెప్పాలి.

ఎక్కడ వరకు ఎందుకు ఈ ఏడాదే సంక్రాంతి సీజన్ ఎంత రసవత్తరమైన పోటీతో గడిచిందో చూసాము. కానీ మున్ముందు రోజుల్లో పరిస్థితులు ఒకవేళ చక్కబడకపోతే అగ్ర హీరోల స్టార్డం పరిస్థితి అంతా ఏంటి? వారి సినిమా వస్తుంది అంటే మొదటి రోజు భారీ వసూళ్ల వర్షమే.. ఫస్ట్ డే ఫస్ట్ షో సంబరాలు బెనిఫిట్ షోలు థియేటర్స్ దగ్గర భారీ ఎత్తున అభిమానుల కోలాహలాలుతో ఒక స్టార్ హీరో సినిమా విడుదలయ్యింది అంటే వారి అభిమానులకు ఆ ప్రతి విడుదల రోజు మరో పండుగ అంతే.

మరి రాబోయే రోజుల్లో మళ్ళీ అలాంటి పరిస్థితి నెలకొంటుందా?అని తొలుస్తున్న ప్రశ్న.ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక స్టార్ హీరో సినిమా విడుదలైనా ఖచ్చితంగా హౌస్ ఫుల్స్ పడే అవకాశం లేదు. మొదటిరోజు అంటే హార్డ్ కోర్ ఫ్యాన్స్ డేర్ చేసి చూసేసినా అది మాత్రం ఆ సినిమా ఫుల్ రన్ కు సరిపోదు. ఎలాంటి సినిమా హిట్ బాట పట్టాలి అన్నా అందుకు ఫ్యామిలీ ఆడియన్స్ వల్లే అవుతుంది. మాస్ ఆడియెన్స్ చూసినాఅ ఓ మాదిరి వసూళ్లు వచ్చేస్తాయి కానీ మేజర్ ఆఫ్ సినిమాలు అంతా ఫ్యామిలీ ఆడియెన్స్ పై ఆధారపడి ఉంటాయి.

మరి వారు అంత రిస్క్ తీసుకొని థియేటర్స్ కు వస్తారా? మరి రానప్పుడు ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా విడుదల అయినా ఉపయోగం ఏముంది?పైగా ఈ మధ్య కాలంలోనే ఓటిటి హవా కూడా పెరిగిపోయింది. వాటిలో కొత్త సినిమా చూసినా సరే థియేటర్ లో చూసిన మజా రాదు. కానీ ఇప్పుడున్న జనం కూడా ఎక్కువగా ఓటిటికే మొగ్గు చూపుతున్నారు. దీనితో ఇది కూడా స్టార్ హీరోలకు రిస్కే.. ప్రమోషన్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ ఇలా నానా హంగామా చేసి హైప్ తెస్తేనే కానీ చాలా సినిమాలకు థియేటర్స్ వరకు రారు. మరి ఇప్పుడు ఏకంగా ప్రాణాల వరకు అంటే కష్టమే. ఇక మీదట కూడా ఇదే పరిస్థితి కనుక కొనసాగినట్టయితే ఖచ్చితంగా వారి క్రేజ్ కు గండి పడడం ఖాయం. మరి రాబోయే రోజులు ఎలా ఉంటాయో కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు