ఆగిపోయిందనుకున్న నితిన్ సినిమా షూటింగ్ పూర్తయింది.

ఆగిపోయిందనుకున్న నితిన్ సినిమా షూటింగ్ పూర్తయింది.

Published on Aug 16, 2014 4:06 PM IST

Nithin_Yami-Gautam

యంగ్ హీరో నితిన్, యామి గౌతమ్ జంటగా నటిస్తున్న సినిమా ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’. ప్రభుదేవా శిష్యుడు ప్రేం సాయి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫోటాన్ కథాస్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా పొల్లాచ్చిలో చిత్రీకరించిన పాటతో ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని స్టైలిష్ నీరజ కోన ట్విట్టర్ లో తెలిపారు.

లవ్, యాక్షన్, రొమాన్స్, ఎంటర్టైన్మెంట్ కలబోతగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో తెరకెక్కించారు. తమిళంలో జర్నీ ఫేం జై హీరోగా నటిస్తున్నాడు. గత ఏడాది నవంబర్లో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నహాలు చేశారు. ‘హార్ట్ ఎటాక్’ కన్నా ముందే విడుదల కావాల్సిన సినిమా. అనూహ్య కారణాల వలన ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తుంది. షూటింగ్ పూర్తవడంతో పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు త్వరగా పూర్తిచేసి సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు