బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించిన ‘దంగల్’ చిత్రం సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇప్పటి వరకూ ఏ ఇండియన్ సినిమా అందుకోలేని విధంగా రూ.2000 కోట్ల వసూళ్లను రాబట్టిందీ చిత్రం. మొదటిసారి రిలీజైనప్పుడు సుమారు రూ. 750 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా రెండు నెలల క్రితమే చైనాలో విడుదలై అనూహ్యమైన, అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది.
సుమారు 6,500 స్క్రీన్లలో రిలీజైన ఈ సినిమా 8 వారాలు గడిచేసరికి 193 మిలియన్ డాలర్లు అనగా రూ. 1255 కోట్లు కొల్లగొట్టి ఇప్పటికీ 2500 స్క్రీన్లలో దిగ్విజయంగా నడుస్తోంది. ఇలా ఒక ఇండియన్ సినిమా చైనాలో విడుదలై ఇంత పెద్ద సక్సెస్ కావడం ఇదే మొదటిసారి. స్వతహాగా చైనా క్రీడలకు అధిక ప్రాధాన్యమిచ్చే దేశం కావడం వలన ఇండియన్ రెజ్లర్ మహావీర్ సింగ్ ఫోగట్ నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ డ్రామా ‘దంగల్’ వారిని విపరీతంగా ఆకట్టుకుంది.
- మహేష్ సినిమాను ప్రశంసించిన తారక్
- మంచి లాభాలను అందిస్తున్న భరత్!
- సాహో అసలు పాయింట్ అదేనట!
- సూపర్ కాంబో సెట్ చేసుకున్న మైత్రి మూవీమేకర్స్!
- 100కోట్ల గ్రాస్ అందుకున్న మహేష్!
సంబంధిత సమాచారం :
