చుట్టాలబ్బాయి’ టీమ్ ని మెచ్చుకున్న దర్శకరత్న దాసరి

chuttalabbayi
దర్శకుడు వీరభద్రం దర్శకత్వంలో హీరో ఆది చేసిన చిత్రం ‘చుట్టాలబ్బాయి’ 18వ తేదీన విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సంగతి తెలిసిందే. తొలుత మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ చిత్రం బి, సి సెంటర్ల ప్రేక్షకులకు కనెక్టవడంతో విజయవంతమై డైరెక్టర్, హీరోకి కావలసిన హిట్ ని అందించింది. అలాగే సినిమా విజయం తరువాత చిత్ర యూనిట్ మొదలుపెట్టిన విజయోత్సవ యాత్ర కూడా మొదలుపెట్టింది.

ఈ సందర్భగా వీరభద్రం ఈ విజయోత్సవ యాత్ర సినిమాకి బాగా ఉపయోగపడిందని, రెండవ వారంలో సైతం బి, సి సెంటర్లలో చాలా థియేటర్లు హౌస్ ఫుల్ అయ్యాయని, ఇక మీదట కూడా కలెక్షన్లు బాగానే ఉంటాయని తెలిపారు. ఇకపోతే దర్శకరత్న దాసరి నారాయణ రావు చిత్రాన్ని చూసి చాలా బాగుందని, కుటుంబంతో కలిసి చూడవలసిన ఫ్యామిలీ ఎంటర్టైనరని తెలిపి, వీరభద్రం సినిమాని బాగా తీశాడని, ఆది నటన బాగుందని మెచ్చుకున్నారు. ఆది తండ్రి సాయికుమార్ ఓ ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రంలో అది సరసన నమితా ప్రమోద్ హీరోయిన్ గా నటించింది.

 

Like us on Facebook