ఒకరోజు వెనక్కి వెళ్ళిన రవితేజ ‘బెంగాల్ టైగర్’ ఆడియో

ఒకరోజు వెనక్కి వెళ్ళిన రవితేజ ‘బెంగాల్ టైగర్’ ఆడియో

Published on Oct 4, 2015 5:30 PM IST

Bengal-tiger
టాలీవుడ్లో మాస్ మసాలాని పర్ఫెక్ట్ గా చూపే హీరో ఎవరు అని చూసుకుంటే మాస్ మహారాజ్ రవితేజ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఇటీవలే ‘కిక్ 2’ సినిమాతో పెద్దగా మెప్పించలేకపోయిన రవితేజ ఈ సారి తన బాడీ లాంగ్వేజ్ కి పర్ఫెక్ట్ గా సరిపోయే మాస పాత్రలో చేస్తున్న సినిమా ‘బెంగాల్ టైగర్’. రవితేజ సరసన అందాల భామలు తమన్నా, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి సంపత్ నంది డైరెక్టర్. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు సినిమా ప్రమోషన్స్ ని కూడా అప్లాన్ చేసుకుంటున్న ఈ చిత్ర టీం ఆడియో మరియు మూవీ రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ చేసింది. అక్టోబర్ 17న భీమ్స్ సంగీతం అందించిన ఆడియోని రిలీజ్ చేసి దీపావళి కానుకగా సినిమాని నవంబర్ 5న రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం నిర్ణయించుకుంది. కానీ తాజాగా ఆడియోని మాత్రం 17న కాకుండా అక్టోబర్ 18న అనగా ఒకరోజు వెనక్కి వెళ్లి రిలీజ్ చేయడానికి సిద్దం అయ్యారు. సంపత్ నంది రవితేజ బాడీ లాంగ్వేజ్ కి పర్ఫెక్ట్ గా సరిపోయే కథతో తీస్తున్న ఈ సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉండనున్నాయి. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ లో కెకె రాధామోహన్ నిర్మిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు