‘సైరా’ రెగ్యులర్ షూట్ మొదలయ్యేది ఎప్పుడంటే !
Published on Nov 5, 2017 7:32 pm IST

మెగా అభిమానులు, తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. చిరు 151వ సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ రెగ్యులర్ షూట్ కు తేదీ ఖాయమైంది. ముందుగా తెలిపినట్టే డిసెంబర్ 6వ తేదీన చిత్రం మొదలుకానుంది. మొదటి షాట్ నరసింహారెడ్డి గెటప్ లో ఉండే మెగాస్టార్ చిరంజీవిపైనే తీయనున్నారు.

మెగా హీరోల సినిమాల్లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ చిత్రం కోసం టీమ్ చాలానే గ్రౌండ్ వర్క్ చేశారు. సినిమాను జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు అమితాబ్, నయనతార, సుదీప్, విజయ్ సేతుపతి వంటి నటీనటులను, ఏ.ఆర్ రెహమాన్ వంటి ప్రముఖ సంగీత దర్శకుడ్ని ప్రాజెక్టులోకి తీసుకున్నారు.

దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా బృందంతో కలిసి లోతైన పరిశోధన చేసి పాత్రల్ని, కథనాన్ని రాసుకుని చిత్రీకరణకు సన్నద్దమయ్యారు. మెగా ఫ్యామిలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ సినిమా కొత్త రికార్డుల్ని సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

 
Like us on Facebook