‘అంధగాడు’ ప్రీరిలీజ్ ఈవెంట్ తేదీ ఖరారు !

‘అంధగాడు’ ప్రీరిలీజ్ ఈవెంట్ తేదీ ఖరారు !

Published on May 25, 2017 12:37 PM IST


యంగ్ హీరో రాజ్ తరుణ్ కొత్త చిత్రం ‘అంధగాడు’ చిత్రం జూన్ 2న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. రాజ్ తరుణ్ ఈ చిత్రంలో అంధుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి విశేషమైన స్పందన వచ్చింది.

ఇప్పటికే విడుదలైన నాలుగు పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. అదే ఉత్సాహంతో చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్ కు సిద్ధమవుతోంది. అంధగాడు చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ మే 28 న హైదరాబాద్ లో జరగనుంది. ఒక్కో చిత్రంతో తన స్థాయిని పెంచుకుంటున్న రాజ్ తరుణ్..ఈ చిత్రంలో అంధుడిగా నటించిన పాత్ర తనని నటుడిగా మరో స్థాయికి చేరుస్తుంది భావిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు