ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘నిన్ను కోరి’!


ఇప్పటికే వరుస హిట్లు అందుకుని దూకుడు మీదున్న నేచ్యురల్ స్టార్ నాని తాజాగా మరో విభిన్నమైన ప్రేమ కథా చిత్రం ‘నిన్ను కోరి’ తో త్వరలో మన ముందుకొచ్చేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు పాటలు ఆకట్టుకోగా నిన్ననే విడుదలైన ట్రైలర్ గ్రాండ్ సక్సెస్ అయి ప్రసంశలు అందుకుంటోంది. దీంతో చిత్ర యూనిట్ రెట్టించిన ఉత్సాహంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సిద్దమవుతోంది.

ఈ నెల 29న ఈ వేడుకను భారీ ఎత్తున నిర్వహించనున్నారు. ఇక వేదిక ఎక్కడనే విషయం త్వరలోనే తెలియనుంది. నాని సరసన నివేతా థామస్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం అందించగా నూతన దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వ భాద్యతలు నిర్వహిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని జూలై 7న విడుదల చేయనున్నారు.

 

Like us on Facebook