‘సైజ్ జీరో’కు డీసెంట్ ఓపెనింగ్స్!

‘సైజ్ జీరో’కు డీసెంట్ ఓపెనింగ్స్!

Published on Nov 28, 2015 10:40 AM IST

Size-zero1
ఆర్య, అనుష్క ప్రధాన పాత్రల్లో నటించగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన సినిమా ‘సైజ్ జీరో’. ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా రెండు భాషల్లో భారీ ఎత్తున విడుదలైంది. ఈ సినిమా కోసం 15కేజీలకు పైనే బరువు పెరిగి అనుష్క చేసిన సాహసం ‘సైజ్ జీరో’కు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇక అందుకు తగ్గట్లుగానే ‘సైజ్ జీరో’ టీమ్ చేపట్టిన ప్రమోషన్స్‌ కూడా ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి.

ఈ నేపథ్యంలోనే ‘సైజ్ జీరో’ సినిమాను ఒక స్టార్ హీరో సినిమా స్థాయిలో పెద్ద ఎత్తున సుమారు 1500 థియేటర్లలో విడుదల చేశారు. సినిమాకున్న క్రేజ్ దృష్ట్యా మొదటి రోజు అంతటా మంచి కలెక్షన్స్ వచ్చాయి. ముఖ్యంగా బాహుబలి, రుద్రమదేవి లాంటి హిట్ సినిమాల తర్వాత అనుష్క రేంజ్‌ను అదే స్థాయిలో పెంచేసే సినిమాగా సైజ్ జీరోకు ప్రచారం రావడంతో ఈ సినిమాకు మొదటి రోజు ఓపెనింగ్స్ బాగున్నాయి. పీవీపీ సంస్థ ఈ సినిమాను నిర్మించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు