ఈ జనరేషన్‌లో మహేష్ ఫేవరైట్ హీరోయిన్ ఎవరంటే..!

ఈ జనరేషన్‌లో మహేష్ ఫేవరైట్ హీరోయిన్ ఎవరంటే..!

Published on Dec 1, 2015 11:31 AM IST

mahesh-and-deepika
సూపర్ స్టార్ మహేష్‌ అంటే దేశవ్యాప్తంగా ప్రేక్షకులు, అభిమానులే కాక, సినీ ప్రముఖులు కూడా ఏ స్థాయి క్రేజ్ చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి సూపర్ స్టార్‌కి కూడా ఫేవరైట్ హీరో, హీరోయిన్, డైరెక్టర్ అంటూ ఉంటారు కదా? ఇక ఇదే విషయమై మహేష్‌ను పలుసార్లు ప్రశ్నిస్తే ఎక్కువగా ఆయన పాతతరం వారినే ప్రస్తావిస్తూ, వారే తన ఫేవరైట్ అంటూ చెబుతూ ఉండేవారు. అయితే తాజాగా మహేష్, ఇప్పుడున్న జనరేషన్‌లో మీ ఫేవరైట్ హీరోయిన్ ఎవరు? అన్న ప్రశ్నకు బాలీవుడ్ టాప్ హీరోయిన్ పేరును ప్రస్తావించి ఆసక్తి రేకెత్తించారు.

ఓ ప్రముఖ దినపత్రికతో మాట్లాడుతూ.. “నా ఆల్‌టైమ్ ఫేవరైట్ హీరోయిన్ అంటే శ్రీదేవి. ఇప్పుడయితే దీపికా పదుకొనే నా ఫేవరైట్ హీరోయిన్. పీకూ సినిమాలో ఆమె నటనకు ఫిదా అయిపోయా. అందం, అభినయం రెండూ కలిగి ఉండడం గొప్ప విషయం. దీపికా అందం, అభినయం రెండింట్లోనూ మెప్పిస్తుంది” అని తెలిపారు. మహేష్ లాంటి టాప్ స్టార్ దగ్గర్నుంచి ఈ స్థాయి ప్రశంసలు దక్కడంతో దీపికా పదుకొనే ఆనందంలో మునిగిపోయారు. ట్విట్టర్‌లో ఇదే విషయమై స్పందిస్తూ మహేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక గతంలో సౌత్‌లో మహేష్ తన ఫేవరైట్ హీరో అని దీపికా పలుసార్లు ప్రస్తావించిన విషయం తెలిసిందే!

సంబంధిత సమాచారం

తాజా వార్తలు