ఆలస్యమవుతున్న ‘సైరా’ షూటింగ్ !

ఆలస్యమవుతున్న ‘సైరా’ షూటింగ్ !

Published on Jan 17, 2018 3:51 PM IST


మెగాస్టార్ చిరంజీవి తన 151వ చిత్రంగా తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ‘సైరా’ను చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ మొదలై ఒక షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి ఆరంభంలో రెండవ షెడ్యూల్ కు వెళ్లాల్సి ఉంది. కానీ కారణాలు తెలియరాలేదుకానీ అది కాస్త వాయిదాపడినట్టు సమాచారం.

ఫిబ్రవరి 20వ తేదీ నుండి కేరళలో షూట్ మొదలుకానుంది. కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నయనతార కథానాయకిగా నటిస్తుండగా, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్ వంటి స్టార్ నటీ నటులు పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు