ఆ ప్రమాదాన్ని తట్టుకుని నిలబడిగలిగే సత్తా రామ్ చరణ్ కు ఉందా ?

ఆ ప్రమాదాన్ని తట్టుకుని నిలబడిగలిగే సత్తా రామ్ చరణ్ కు ఉందా ?

Published on Dec 10, 2016 11:00 AM IST

dhruva
ప్రస్తుతం అన్ని రంగాలు కరెన్సీ బ్యాన్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న సంగతి తేలింది. అటువంటి రంగాల జాబితాలో సినీ పరిశ్రమ కూడా ఉంది. జేబులో సరిపడా కరెన్సీ లేనందు వల్ల సామాన్యులు చాలా వరకూ సినిమాకు దూరమయ్యారు. ముఖ్యంగా బి, సి సెంటర్ ప్రేక్షకులు అతి కష్టం మీద సినిమా చూస్తున్నారు. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లోనే చరణ్ ‘ధృవ’ విడులైంది. మాస్ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల సినిమాకి మామూలు పరిస్థితుల్లో అయితే రికార్డ్ కలెక్షన్స్ ఉండాలి. కానీ పరిస్థితి అలా లేదు కాబట్టి ఈ ఓపెనింగ్స్ కాస్త తక్కువగానే ఉంటాయి. కానీ ఖర్చు పెట్టిన 55 కోట్ల బడ్జెట్ వస్తుందా లేదా అనేదే ప్రస్తుతం అభిమానుల్లో నలుగుతున్న ప్రశ్న.

మొదటి రోజు ఏపీ, తెలంగాణల్లో కలుపుకుని మొత్తం 11 కోట్లు వసూలయ్యాయి. మామూలు రోజుల్లో ఇది ఇంకాస్త ఎక్కువగా ఉండేది. పైగా వేరే సినిమాలేవీ లేనందున నిర్మాత అల్లు అరవింద్ వీలైనన్ని ఎక్కువ సెంటర్లలో సినిమాని రిలీజ్ చేశారు. కానీ సినిమాలకు వచ్చే జనాలు తక్కువగా ఉండటం, ఆ వచ్చేవారు కూడా మంచి మంచి మల్టీ ప్లెక్సులు, వేరే థియేటర్లు వెతుక్కోవడం వలన మిగిలిన సాదాసీదా థియేటర్లు హౌజ్ ఫుల్ కావడం లేదు. కనుక కలెక్షన్లలో ఎక్కువ భాగం థియేటర్ల ఖర్చులకే వెళ్లిపోయి చేతుల్లో మిగిలేది తక్కువగానే ఉంటుంది. లాంగ్ రన్ లో పరిస్థితి మెరుగుపడి సరిపడా కరెన్సీ సర్క్యులేషన్ లోకి వస్తేనే సినిమా రికార్డ్ కలెక్షన్ల దిశగా సాగుతుంది లేకుంటే పెట్టిన బడ్జెట్ పై కొంత మేర కలెక్షన్లతో సర్దుకోవాల్సి ఉంటుంది. ఏది ఏమైనా కరెన్సీ కరువులో రిలీజై రెగ్యులర్ అంత కాకపోయినా మంచి ఓపెనింగ్స్ రాబట్టి, భవిష్యత్తుల్లో సేఫ్ కలెక్షన్స్ రాబడుతుంది అనే నమ్మకాన్ని తెచ్చుకున్న మొదటి భారీ బడ్జెట్ చిత్రంగా ‘ధృవ’ నిలిచిపోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు