విన్నర్ జోరు బాగానే ఉంది..!

విన్నర్ జోరు బాగానే ఉంది..!

Published on Feb 25, 2017 6:30 PM IST


సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం విన్నర్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా మంచి ఓపెనింగ్స్ ని సాధించింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో కమర్షియల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం తొలిరోజు మంచి వసూళ్లను రాబట్టింది.

స్టూడెంట్స్ కి పరీక్షల సమయమైనా ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.5.7 కోట్ల షేర్ ని వసూలు చేసింది. ఈ వీకెండ్ ముగిసే సమయానికి ఈచిత్రం ఇంకా మంచి కలెక్షన్ లను రాబడుతుందని ట్రేడ్ పండితులు అంటున్నారు. సాయిధరమ్ తేజ్ క్రేజ్ కి ఇది నిదర్శనమని అంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు