రెండో రోజు సిట్ విచారణ వివరాలు !


డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ నటీనటులు, ప్రముఖుల ఒక్కొక్కరిగా సిట్ విచారణకు హాజరవుతున్నారు. నిన్నటి నుండి ప్రారంభమైన విచారణలో భాగంగా మొదటి దర్శకుడు పూరి జగన్నాథ్ ను విచారించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అధికారులు ఈరోజు సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె. నాయుడును విచారించింది. సుమారు 6 గంటల పాటు ఈ విచారణ జరిగింది.

విచారణ కఠినంగా జరిగిందని, అందులో కెల్విన్ ముఠాకు సంబందించిన వివరాలను రాబట్టే ప్రయత్నం అధికారులు చేశారని తెలుస్తోంది. విచారణలో షూటింగ్స్ నిమిత్తం చాలా పబ్స్ కు తిరిగేవాడినని, అందువలనే తనకు చాలా మంది ఈవెంట్ ఆర్గనైజర్లతో పరిచయాలున్నాయని శ్యామ్ కె నాయుడు తెలిపారట. ఇక ఎక్సయిజ్ శాఖ కమీషనర్ చంద్రవదన్ ఎంక్వైరీ లోతుగా జరుగుతోందని, పూరి, శ్యామ్ కె నాయుడు విచారణకు సహకరించారని, మిగతావారు కూడా అలానే సహకరించాలని అన్నారు.

 

Like us on Facebook