సైంటిఫిక్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ‘టాక్సీవాలా’

సైంటిఫిక్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ‘టాక్సీవాలా’

Published on Mar 24, 2018 5:50 PM IST

యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన చిత్రాల్లో ‘టాక్సీవాలా’ కూడ ఒకటి. చాన్నాళ్ల క్రితమే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా మే 18న విడుదలకానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం సరికొత్త కాన్సెప్ట్ తో సైంటిఫిక్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. నిన్ననే ఫస్ట్ గేర్ పేరుతో విడుదలైన చిన్నపాటి వీడియో ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకోగా కాసేపటి క్రితమే రిలీజైన ఫస్ట్ లుక్ కు కూడ మంచి స్పందన లభిస్తోంది.

నూతన దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ డైరెక్టక్ చేసిన ఈ చిత్రంలో మాళవిక శర్మ, ప్రియాంక జావల్కర్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్ 2, యువీ క్రియేషన్స్ బ్యానర్లు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్కెఎన్ నిర్మిస్తున్నారు. ఇకపోతే విజయ్ భరత్ కమ్మ, తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ లతో కూడ సినిమాలు చేయనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు