దేవిశ్రీ ప్రసాద్ హీరో అయిపోతున్నాడు..!

దేవిశ్రీ ప్రసాద్ హీరో అయిపోతున్నాడు..!

Published on Nov 28, 2015 9:29 AM IST

Devi-sri-rprasad
దేవిశ్రీ ప్రసాద్.. ప్రస్తుతం తెలుగులో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా అభిమానుల మన్ననలు పొందుతూ దూసుకుపోతోన్న రాకింగ్ స్టార్. వరుస హిట్స్‌తో యూత్‌లో పిచ్చ క్రేజ్ సంపాదించిన ఈ మ్యూజిక్ డైరెక్టర్, ఈమధ్యే విడుదలైన ‘కుమారి 21F’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. దర్శకుడు సుకుమార్ నిర్మాతగా రూపొందించిన ఈ సినిమా హిట్‍ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కొల్లగొడుతూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే ‘కుమారి 21F’ టీమ్ హైద్రాబాద్‌లో ఓ సక్సెస్ మీట్‌లో ఏర్పాటు చేసింది. ఇక ఈ సక్సెస్ మీట్‌కు హాజరైన ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఒక ఆసక్తికర ప్రకటన చేశారు.

మ్యూజిక్ డైరెక్టర్‌గా రాకింగ్ స్టార్ అనిపించుకున్న దేవిశ్రీ ప్రసాద్‌ను తాను హీరోగా పరిచయం చేస్తానని దిల్‌రాజు ప్రకటించారు. ఇప్పటికే ఎన్నోసార్లు హీరోగా నటించమని అవకాశాలు వచ్చినా, దేవిశ్రీ వాటన్నింటినీ పక్కనబెట్టి మ్యూజిక్‌పైనే శ్రద్ధ పెట్టారు. అయితే సరైన స్క్రిప్ట్ వస్తే మాత్రం హీరోగా చేసేందుకు తాను సిద్ధమే అని మాత్రం దేవీ చెబుతూ వచ్చారు. ఇప్పుడు ఆ సరైన స్క్రిప్ట్‌ను దిల్‌రాజు సిద్ధం చేసే పనిలో ఉన్నారట. ఇక ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తారని దిల్‌రాజు ప్రకటించడం ఇక్కడ మరో ఆసక్తికర అంశంగా చెప్పుకోవచ్చు. దిల్‌రాజు-సుకుమార్‌ల కాంబినేషన్‌లో అందులోనూ హీరో దేవిశ్రీ అంటే ఈ కాంబినేషన్ వినడానికే అద్భుతంగా ఉందనడంలో అతిశయోక్తి లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు