బాలయ్య సినిమా నుంచి తప్పుకున్న దేవిశ్రీ!

devi-sri-prasad
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 100వ సినిమా ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ తెలుగు సినీ పరిశ్రమలో కొద్దికాలంగా ఎంతో ఆసక్తి రేకెత్తిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. విలక్షణ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తోన్న ఈ చారిత్రక సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించాల్సింది. అయితే ఆయన ఇతర సినిమాలతో బిజీగా ఉండడంతో గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా నుంచి తప్పుకున్నారు. ఇలాంటి చారిత్రక సినిమా కోసం ఎక్కువ కాలం కష్టపడాల్సి ఉన్నందున, ఇతర కమిట్‌మెంట్స్ వల్ల అది సాధ్యపడదనే దేవిశ్రీ ఈ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చేశారట.

ఇక దేవిశ్రీ ప్రసాద్ వెళ్ళిపోవడంతో ప్రస్తుతం క్రిష్ వేరొక సంగీత దర్శకుడిని సంప్రదిస్తున్నారట. ప్రస్తుతానికి కీరవాణి, ఇళయరాజా, చిరంతన్ భట్‌లలో ఎవరినో ఒకరిని సంగీత దర్శకుడిగా సంప్రదించాలని క్రిష్ ప్రయత్నాలు చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాను రాజీవ్ రెడ్డితో కలిసి క్రిష్ స్వయంగా నిర్మిస్తున్నారు. భారీ విజువల్ ఎఫెక్ట్స్, సెట్టింగ్స్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను క్రిష్, బాలయ్య కెరీర్‌కు మరపురాని సినిమాగా నిలిచేలా తీర్చిదిద్దుతున్నారు.

 

Like us on Facebook