దేవీశ్రీ ఎన్.టి.ఆర్ కి కూడా అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఇచ్చాడట.!

దేవీశ్రీ ఎన్.టి.ఆర్ కి కూడా అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఇచ్చాడట.!

Published on Aug 4, 2015 8:39 AM IST

ntr-devi
టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ఒకడు.. దేవీశ్రీ ప్రసాద్ ఆల్బమ్స్ అన్నీ పెద్ద హిట్ అవుతుంటాయి. వాటికంటే మించి ఆయన కంపోజ్ చేసిన ఐటమ్ సాంగ్స్ ఇంకా ఫేమస్ అవుతుంటాయి. అది కూడా డైరెక్టర్ సుకుమార్ – దేవీశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో ఓ మూవీ వస్తోంది అంటే ఆ సినిమాలో అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఉంటుంది. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన అ అంటే అమలాపురం, రింగ రింగా, డియ్యాలో డియ్యాలో లాంటి పాటలు ఇప్పటికీ మనకు వినిపిస్తూనే ఉన్నాయి. సుకుమార్ తన నెక్స్ట్ మూవీ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లండన్ లో జరుగుతోంది.

ఈ సినిమాకి కూడా దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించడమే కాదు, ఇప్పటికే ఈ సినిమా కోసం ఓ సూపర్బ్ ఐటమ్ సాంగ్ ని కంపోజ్ చేసాడని సమాచారం. ఆ సాంగ్ గత సినిమాల ఐటమ్ సాంగ్స్ కంటే మించి ఉంటుందని అంటున్నారు. మరోవైపు ఈ చిత్ర టీం ఈ ఐటమ్ సాంగ్ లో ఓ స్టార్ హీరోయిన్ చేత డాన్సులు వేయించాలని ట్రై చేస్తున్నారు. ఇప్పటికే తమన్నా, రాశీ ఖన్నా లాంటి పేర్లని పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఓ స్టార్ హీరోయిన్ ఈ పాత కోసం ఫైనలైజ్ చేయనున్నారు. ఎన్.టి.ఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం లండన్ లో ఎన్.టి.ఆర్ – రాజేంద్ర ప్రసాద్ – రకుల్ ప్రీత్, ఇతర తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. సెప్టెంబర్ వరకూ అక్కడే ఈ సినిమా షెడ్యూల్ జరగనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు