ఇంటర్వ్యూ : ధన్ రాజ్ – దర్శకుడు శ్రీకిశోర్ లేకపోతే ఈ ‘దేవి శ్రీ ప్రసాద్’ సినిమానే లేదు !

ఇంటర్వ్యూ : ధన్ రాజ్ – దర్శకుడు శ్రీకిశోర్ లేకపోతే ఈ ‘దేవి శ్రీ ప్రసాద్’ సినిమానే లేదు !

Published on Nov 13, 2017 1:20 PM IST

కమెడియన్, నటుడు అయిన ధన్ రాజ్ నటించిన తాజ్ చిత్రం ‘దేవి శ్రీ ప్రసాద్’. శ్రీకిషోర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 17న రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఆ విశేషాలు మీకోసం..

ప్ర) ఈ సినిమా ఎలా ఉండబోతోంది ?

జ) ఇది హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా. ఇందులో హీరోయినే హీరో. ఆమె కాకుండా ఇందులో నాతో ముగ్గురు నటించారు. ఒక ఫేమస్ హీరోయిన్ చనిపోయి మార్చ్యురీకి వస్తే ఆమెను ముగ్గురుకి ఫ్యాన్స్ తాగిన మత్తులో ఏం చేశారు. వాళ్ళు చేసిన పనికి ఎలాంటి శిక్షను అనుభవించారు అనేది కథ మధ్యలో చాలా మలుపులుంటాయి.

ప్ర) చిత్రాన్ని ఎవరికైనా చూపించారా ?

జ) సినిమా చాలా బాగా వచ్చింది. ఈ విషయం అందరికీ తెలియాలని ఇండస్త్రీలోని కొందరు హీరోలకి చూపించాం. వాళ్ళు కూడా బాగుందన్నారు. ఖచ్చితంగా ప్రమోట్ చేస్తామన్నారు.

ప్ర) ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది ?

జ) ఇందులో నాది మార్చ్యురీలో పనిచేసే ఉద్యోగి పాత్ర. చాలా బాగా వచ్చింది. దర్శకుడు శ్రీకిషోర్ కోసం రెమ్యునరేషన్ తీసుకోకుండా ఈ సినిమా చేశాను. అతను కూడా నాకు మంచి పాత్ర ఇచ్చాడు.

ప్ర) టీజర్, ట్రైలర్ పట్ల నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి కదా వాటి పట్ల మీ స్పందన ?

జ) టీజర్, ట్రైలర్లో శవాన్ని మానభంగం చేయడమేమిటి అనే కామెంట్స్ వచ్చాయి. కానీ సినిమాలో దానికో జడ్జిమెంట్ ఉంటుంది. చూస్తేనే అది అర్థమవుతుంది. ఇది యూత్ సినిమానే కానీ బూతు సినిమా కాదు. శ్రీకిషోర్ చాలా బాగా సినిమాను హ్యాండిల్ చేశాడు. కొంతమంది అమ్మాయిలకి కూడా సినిమా చూపించాం. వాళ్లకు కూడా నచ్చింది.

ప్ర) దర్శకుడు శ్రీకిషోర్ వర్క్ ఎలా ఉంది ?

జ) శ్రీకిషోర్ కథను ముందుగా 10 మందికి పైగా హీరోయిన్లకు చెప్పాడు. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. మొదటి నాకు చెప్పినప్పుడు ఇలాగే తీస్తావా మధ్యలో మార్పులేమైనా చేస్తావా అని అడిగాను. శ్రీకిషోర్ మాత్రం ఎలా చెప్పానో అలాగే తీస్తానని మాటిచ్చాడు. అలాగే తీశాడు కూడ.

ప్ర) మీ డైరెక్టర్ గురించి చెప్పండి ?

జ) సినిమాను 20 రోజుల్లో తీసేశాడు. చాలా తక్కువ బడ్జెట్లో చేశాడు. అంత తక్కువలో చేయడం నిజంగా చాలా కష్టం. కానీ శ్రీకిషోర్ చేశాడు. అతను లేకపోతే సినిమానే లేదు.

ప్ర) మీవి రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఎలా ఫీలవుతున్నారు ?

జ) చాలా హ్యాపీగా ఉంది. ‘పిల్ల జమిందార్’ తర్వాత అంత భావోద్వేగపూరితమైన పాత్ర ఈ ‘లండన్ బాబులు’ సినిమాతోనే వచ్చింది. ఇక ‘దేవి శ్రీ ప్రసాద్’ సినిమాలో పాత్ర చూశాక ధన్ రాజ్ ఎలాంటి పాత్రైనా చేస్తాడు అంటారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు