మహేష్ ట్వీట్ కి ఆ హీరో ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీ

మహేష్ ట్వీట్ కి ఆ హీరో ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీ

Published on Oct 21, 2019 11:15 AM IST

సూపర్ స్టార్ మహేష్ సోషల్ మీడియా లో ఎంత యాక్టీవ్ గా ఉంటారో తెలిసిందే. తన పర్సనల్ మరియు ప్రొఫెషన్ విషయాలతో పాటు, కాంటెంపరరీ సోషల్ ఇష్యూస్ అలాగే ఇతర హీరోల మూవీలపై ఆయన స్పందిస్తూ ఉంటారు. చిన్న హీరో పెద్ద హీరో అని తేడా లేకుండా ఆయనకు మూవీ నచ్చితే చిత్ర టీమ్ ని అభినందిస్తూ ట్విట్టర్ లో పోస్ట్స్ పెడుతుంటారు. తాజాగా తమిళంలో ధనుష్ నటించిన అసురన్ మూవీ విడుదలై విశేష ఆధరణ దక్కించుకుంటుంది. డీగ్లామర్ రోల్ లో ధనుష్ మధ్య వయస్కుడి పాత్రలో సహజ నటనతో కట్టిపడేశారు.

ఈ చిత్రం చూసిన మహేష్ హీరో ధనుష్ మరియు దర్శకుడు వెట్రి మారన్ లతో పాటు చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించడంతో పాటు, శుభాకాంక్షలు తెలిపారు. దీనితో ధనుష్ ఫ్యాన్స్ ఆనందించడంతో పాటు, తమ హీరో మూవీని అంతలా పొగిడిన మహేష్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సూపర్ స్టార్ ఊరికే అవుతారా ఇలాంటి గొప్ప లక్షణాలు ఉండబట్టే అని కొనియాడుతున్నారు. కాగా మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరూ మూవీ చిత్రీకరణ చివరి దశకు చేరింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్, రష్మిక జంటగా నటిస్తున్న ఈ మూవీ జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు