ధనుష్ సినిమా వాయిదా పడింది!

dharmayogi
తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లో హీరో ధనుష్‌కు ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తమిళంలో స్టార్ హీరోల్లో ఒకరుగా చలామణీ అవుతూ వస్తోన్న ధనుష్, తెలుగులోనూ డబ్బింగ్ సినిమాలతో మంచి ఫాలోయింగ్ సంపాదించారు. ఇక తాజాగా ఆయన హీరోగా నటించిన ‘కోడి’ అనే తమిళ సినిమాను తెలుగులో ‘ధర్మ యోగి’ అన్న పేరుతో డబ్ చేసిన విషయం తెలిసిందే. తమిళ వర్షన్ రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతోంటే, తెలుగు వర్షన్ మాత్రం కొన్ని సాంకేతిక కారణాల రీత్యా వాయిదా పడింది.

ప్రస్తుతం ఒకరోజు ఆలస్యంగా అంటే అక్టోబర్ 29న ధర్మ యోగి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ధనుష్ నటించిన గత నాలుగు సినిమాలన్నీ ఇలా రిలీజ్ రోజున తెలుగులో విడుదలకు నోచుకోకుండా పోవడం ప్రత్యేకించి ప్రస్తావించుకోవాలి. ధనుష సరసన త్రిష, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు ధురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించారు.

Bookmark and Share