కొత్త లుక్ కోసం ట్రై చేస్తున్నాడట !

కొత్త లుక్ కోసం ట్రై చేస్తున్నాడట !

Published on Mar 21, 2020 10:00 PM IST

తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కుమారుడు ‘ధృవ్’ తెలుగులో సంచలన విజయం సాధించిన ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ తో తమిళంలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే యాంగ్రీ యంగ్ మ్యాన్ క్యారెక్టర్ ద్వారా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ధృవ్ ఈసారి కూడా అదే తరహా సినిమా చేయాలని అనుకుంటున్నాడట. ఇప్పటికే రెండు స్క్రిప్ట్స్ ను లైన్ లో పెట్టిన ఈ యంగ్ హీరో త్వరలో వాటిలో ఏదొక స్క్రిప్ట్ ను ఫైనల్ చేస్తాడట.

ఇప్పటివరకు తన తర్వాతి చిత్రాన్ని ప్రకటించని ధృవ్ ప్రస్తుతం కొత్త లుక్ కోసం ట్రై చేస్తున్నాడట. కొత్త హెయిర్ స్టైల్ తో పాటు షార్ప్ లుక్ కోసం ట్రై చేస్తున్నాడట. మొత్తానికి ఈసారి కూడా ధృవ్ రఫ్ అండ్ ఎనర్జిటిక్ పాత్రలోనే నటించడానికి ఆశ పడుతున్నాడు. మరి ఆ సినిమా ఏమిటి, దర్శకుడు ఎవరు, ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు