రామ్ చరణ్ ‘ధృవ’ సెన్సార్ పూర్తి!

రామ్ చరణ్ ‘ధృవ’ సెన్సార్ పూర్తి!

Published on Nov 21, 2016 3:24 PM IST

dhruva
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ‘ధృవ’ సినిమాపై ఏస్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నెలరోజుల క్రితమే విడుదలైన టీజర్ సినిమాపై ఉన్న అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్తే, ఈమధ్యే విడుదలైన ఆడియో కూడా అందుకు ఏమాత్రం తగ్గకుండా ఆకట్టుకొని దూసుకుపోతోంది. ఇక వచ్చే నెల 9వ తేదీన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ముందే ప్రకటించిన టీమ్, అందుకు తగ్గట్టే ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకుంటోంది. ఇక విడుదలకు రెండు వారాల ముందే సెన్సార్‌తో సహా అన్ని కార్యక్రమాలూ పూర్తవడం విశేషంగా చెప్పుకోవాలి.

ఈ ఉదయం సెన్సార్ పూర్తి చేసుకున్న సినిమాకు సెన్సార్ బృందం ‘యూ/ఏ’ సర్టిఫికెట్ జారీ చేసింది. స్టార్ కమర్షియల్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్ ‘ధృవ’ అనే ఓ పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. నాటితరం హీరో అరవింద్ స్వామి విలన్‌గా నటించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. డిసెంబర్ మొదటివారంలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగనుంది. రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా తమిళంలో ఘన విజయం సాధించిన ’తని ఒరువన్‌’కి రీమేక్!

సంబంధిత సమాచారం

తాజా వార్తలు