బాలయ్యను క్రాస్ చేసేసిన రామ్ చరణ్ !
Published on Oct 18, 2016 12:00 pm IST

gpsk-dhruva
రాబోయే నాలుగైదు నెలల్లో తెలుగు పరిశ్రమలో పెద్ద పెద్ద సినిమాలే రిలీజబోతున్నాయి. వాటిలో బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’, రామ్ చరణ్ ‘ధృవ’ లు కూడా ఉన్నాయి. చారిత్రక నైపథ్యంలో సాగే కథ కావడం, బాలయ్య శాతకర్ణి గెటప్ లో కనిపిస్తుండటంతో నందమూరి అభిమానుల్లో ఈ సినిమాపై భారీ క్రేజ్ ఉంది. అలాగే ‘గోవిందుడు అందరివాడే, బ్రూస్ లీ’ వంటి చిత్రాల పరాజయం తరువతా ఏంటో నమ్మకంతో చెర్రీ చేస్తున్న చిత్రం కావడంతో ‘ధృవ’ పై మెగా అభిమానులు ఆశలన్నీ పెట్టుకున్నారు.

ఇకపోతే ఈ చిత్రాల తాలూకు టీజర్లు ఇటీవలే విడుదలయ్యాయి. కొద్దీ గంటల గ్యాప్ తో విడుదలైన ఈ టీజర్లు యూట్యూబ్ లో పోటా పోటీగా దూసుకుపోతున్నాయి. ముందుగా బాలయ్య టీజర్ అక్టోబర్ 10న ఉదయం రిలీజై సాయంత్రానికి మిలియన్ మార్క్ దాటేయగా ఈరోజుటి వరకూ 2,430,992 హిట్స్ సాధించింది. మరోవైపు చెర్రీ ‘ధృవ’ టీజర్ 11న విడుదలై బాలయ్య శాతకర్ణిని దాటిపోయి 3 మిలియన్ మార్కును సులభంగా అధిగమించింది. ఇప్పటి వరకూ ఈ టీజర్ కు 3,153, 923 హిట్స్ లభించాయి. ఇక ‘ధృవ’ డిసెంబర్ న విడుదల కానుండగా, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సంక్రాంతి బరిలోకి దిగనుంది.

 
Like us on Facebook