రామ్ చరణ్‌కి ‘ధృవ ధృవ’ పాట ఎందుకిష్టమంటే..!

రామ్ చరణ్‌కి ‘ధృవ ధృవ’ పాట ఎందుకిష్టమంటే..!

Published on Dec 4, 2016 6:31 PM IST

ram-charan-title
రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ‘ధృవ’ మరో ఐదు రోజుల్లో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైపోయింది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్‌తో అంతటా హోరేత్తిస్తోంది. ఈ సాయంత్రం హైద్రాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ లైన్స్‌లో జరుగుతోన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్‌తో అభిమానుల హంగామా కూడా మొదలైపోయింది. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ధృవ టీమ్ ధృవ ధృవ టైటిల్ సాంగ్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. రామ్ చరణ్‌కు ఈ ఆల్బమ్‌లో ఫేవరైట్ సాంగ్ ఇదేనట.

వినగానే ఎక్కేసే స్థాయిలో ఉండే ఈ పాటకు వచ్చే విజువల్స్ పాట స్థాయిని మరింత పెంచేవిగా ఉంటాయట. ధృవ అనే పోలీసాఫీసర్‌గా రామ్ చరణ్ గట్స్ అన్నీ ఈ పాటలో చూయిస్తారట. ఇక చరణ్ సిక్స్‌ప్యాక్ లుక్ కూడా ఈ పాటలోనే కనిపించనుంది. ఈ పాట కోసం చరణ్ చాలా కష్టపడ్డారని, ఆయనకు ఈ పాటంటే ఎందుకు అంతిష్టమో, స్క్రీన్‌పై ఆయనను చూస్తే అర్థమవుతుందని సంగీత దర్శకుడు హిపాప్ థమిజా తెలిపారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కగా, గీతా ఆర్ట్స్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 9న భారీ ఎత్తున విడుదలవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు