కరెన్సీ కొరతలో విడుదలైన ‘ధృవ’ మొదటిరోజు కలెక్షన్లు ఇలా ఉన్నాయి !

కరెన్సీ కొరతలో విడుదలైన ‘ధృవ’ మొదటిరోజు కలెక్షన్లు ఇలా ఉన్నాయి !

Published on Dec 10, 2016 12:43 PM IST

dhruva
మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిత్రం ‘ధృవ’ నిన్ననే ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది. ఈ సినిమా కోసం చరణ్ పూర్తిగా లుక్ మార్చి సిక్స్ ప్యాక్ కూడా ట్రై చేశాడు. తమిళంలో భారీ విజయాన్ని అందుకున్న ‘తనీ ఒరువన్’ కు రీమేక్ గా వస్తున్న చిత్రం కావడం, చరణ్ రెండు పరాజయాల తరువాత చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. తీవ్రమైన కరెన్సీ కొరతలో కూడా విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు ఎంత వసూళ్లు సాధిస్తుందో చూడాలని అభిమానులు, సినీ జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఆ కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి.

ఏరియా కలెక్షన్లు
నైజాం 3.34 కోట్లు
సీడెడ్ 2.26 కోట్లు
వైజాగ్ 1.35 కోట్లు
వెస్ట్ గోదావరి 92 లక్షలు
ఈస్ట్ గోదావరి
90 లక్షలు
కృష్ణ 72 లక్షలు
గుంటూరు 44లక్షలు
నెల్లూరు 44 లక్షలు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు