‘ధృవ’ టైటిల్ సాంగ్ షూట్ ఎప్పుడంటే..!

‘ధృవ’ టైటిల్ సాంగ్ షూట్ ఎప్పుడంటే..!

Published on Oct 25, 2016 6:45 PM IST

dhruva
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ధృవ’ ఎప్పుడెప్పుడు థియేటర్ల ముందుకు వచ్చేస్తుందా.. ఎప్పుడెప్పుడు చూసేద్దామా.. అని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమాపై భారీగా ఉన్న అంచనాలను దసరా కానుకగా విడుదలైన టీజర్ తారాస్థాయికి తీసుకెళ్ళింది. ఇక ఈ టీజర్‍కు వచ్చిన రెస్పాన్స్‌తో హ్యాపీ అయిన టీమ్ రెట్టించిన ఉత్సాహంతో డిసెంబర్ 2న సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు కృషి చేస్తోంది.

ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తికాగా నవంబర్ మొదటి వారంలో మిగిలి ఉన్న ఒక్క ఇంట్రో సాంగ్‌ను కూడా పూర్తి చేయనున్నట్లు టీమ్ తెలిపింది. అదిరిపోయే బీట్‌తో సాగే ఈ ఇంట్రో సాంగ్ కోసం టీమ్ భారీగా ఖర్చు పెట్టనుందట. తమిళంలో ఘన విజయం సాధించిన తని ఒరువన్‌కి రీమేక్ అయిన ఈ పోలీస్ థ్రిల్లర్‌కు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తూండగా, గీతా ఆర్ట్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, నాటితరం హీరో అరవింద్ స్వామి విలన్‍గా కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు