బల్గేరియాలో స్టెప్స్ మొదలెట్టిన బాలయ్య

బల్గేరియాలో స్టెప్స్ మొదలెట్టిన బాలయ్య

Published on Aug 29, 2015 11:36 PM IST

balakrishna
నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 99వ సినిమా ‘డిక్టేటర్’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇటీవలే హైదరాబాద్ లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసిన ఈ చిత్ర టీం లాంగ్ సెకండ్ షెడ్యూల్ కోసం యూరప్ వెళ్ళారు. ప్రస్తుతం ఈ చిత్ర టీం బల్గేరియాలో సందడి చేస్తోంది. బల్గేరియాలో మునుపెన్నడూ చూడని బ్యూటిఫుల్ లొకేషన్స్ లో ఓ పాటని షూట్ చేస్తున్నారు. నిన్నటి నుంచే ఈ చిత్ర టీం ఓ పాట షూట్ ని మొదలు పెట్టారు. బాలకృష్ణతో పాటు హీరోయిన్స్ అయిన అందాల భామలు అంజలి, సోనాల్ చౌహాన్ కూడా షూట్ లో పాల్గొంటున్నారు.

బల్గేరియాలో సాంగ్ షూట్ ఫినిష్ చేసిన తర్వాత ఈ చిత్ర టీం మరో సాంగ్ షూట్ కోసం పోలాండ్ వెళ్లనున్నారు. ఈ రెండు సాంగ్ శూత్స్ తర్వాత బాలకృష్ణ పై ఓ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేయనున్నారు. ఈ యూరప్ షెడ్యూల్ తో దాదాపు 50% షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి కోన వెంకట్ – గోపి మోహన్ కలిసి కథని అందించారు. బాలకృష్ణకి పోటీ ఇచ్చే విలన్స్ గా రవికిషన్, కబీర్ దుహన్ సింగ్ కనిపించనున్నారు. ఎరోస్ ఇంటర్నేషనల్ వారితో కలిసి శ్రీవాస్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు