బల్గేరియాలో ల్యాండ్ అయిన ‘డిక్టేటర్’ టీమ్!

బల్గేరియాలో ల్యాండ్ అయిన ‘డిక్టేటర్’ టీమ్!

Published on Aug 27, 2015 7:28 PM IST

balakrishna
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా చేస్తోన్న 99వ సినిమా ‘డిక్టేటర్’, సెట్స్‌పైకి వెళ్ళక ముందునుంచే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఈ మధ్యే హైద్రాబాద్‌లో ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆ తర్వాత యూరప్‌లో మరో భారీ షెడ్యూల్‌ జరుపుకోనుందన్న విషయం ఇంతకుముందే తెలియజేశాం. తాజాగా ఈ షెడ్యూల్ కోసం సినిమా యూనిట్ బల్గేరియాలో ల్యాండ్ అయింది. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి సూపర్ హిట్ సినిమాల దర్శకుడు శ్రీవాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనుండడంతో పాటు సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.

బాలయ్య రేంజ్ హై వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు మంచి ఎంటర్‌టైనింగ్ అంశాలను కూడా నింపుకున్న డిక్టేటర్ సినిమా ద్వారా ఎరోస్ ఇంటర్నేషనల్ తెలుగు సినిమా నిర్మాణంలోకి అడుగుపెడుతోంది. ఇక ప్రస్తుతం ప్లాన్ చేసిన ఈ యూరప్ షెడ్యూల్‌లో బల్గేరియాతో పాటు పలు ఇతర ఏరియాల్లో 4 పాటలు, ఒక ఫైట్ సీన్, కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇక తెలుగు ఇండస్ట్రీ స్టార్ రైటర్లైన కోన వెంకట్, గోపీ మోహన్, బీవీఎస్ రవి, శ్రీధర్ శ్రీపాన, డైమండ్ రత్నంలు ఈ సినిమాకు స్క్రిప్ట్ సమకూర్చారు. అంజలి, సోనాల్ చౌహాన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు