ఆగష్టు 15న ‘దిక్కులు చూడకు రామయ్య’ ఫస్ట్ లుక్

ఆగష్టు 15న ‘దిక్కులు చూడకు రామయ్య’ ఫస్ట్ లుక్

Published on Jul 30, 2014 12:44 PM IST

dikkulu_choodaku_ramayya

‘ఈగ’, ‘అందాల రాక్షసి’, ‘లెజెండ్’, ‘ఊహలు గుసగుసలాడే’ లాంటి ప్రేక్షకులు మెచ్చీ సినిమాలు తీసిన సాయి కొర్రపాటి మరోసారి తన వారాహి చలన చిత్రం బానర్ పై నిర్మిస్తున్న సినిమా ‘దిక్కులు చూడకు రామయ్య’. ‘ఊహలు గుసగుసలాడే’ ఫేం నాగ శౌర్య హీరోగా, సనని హీరోయిన్ గా పరిచయం చేస్తున్న ఈ సినిమా ద్వారా ఎస్ఎస్ రాజమౌళి దగ్గర పనిచేసిన త్రికోఠి దర్శకుడిగా పరిచయం కానున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఆగష్టు 15న రిలీజ్ చేయనున్నట్లు ఈ చిత్ర టీం తెలియజేసింది. త్వరలో పోస్ట్ పొడక్షన్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసి అక్టోబర్ 1న సినిమా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా ద్వారా నిన్నటి తరం హీరోయిన్ ఇంద్రజ మళ్ళీ తెరపై కనిపించనుంది. ‘లెజెండ్’, ‘ఊహలు గుసగుసలాడే’ తర్వాత వస్తున్న ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకుంటానని సాయి కొర్రపాటి ఎంతో నమ్మకంగా ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు