‘పటాస్’ హక్కులను సొంతం చేసుకున్న దిల్ రాజు

‘పటాస్’ హక్కులను సొంతం చేసుకున్న దిల్ రాజు

Published on Dec 18, 2014 9:49 PM IST

Patas_dil_raju
తాజా సమాచారం ప్రకారం ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ కమ్ నిర్మాత దిల్ రాజు కళ్యాణ్ రామ్ ‘పటాస్’ సినిమా హక్కులను ఆంధ్రా, నై జాం ఏరియాలలో సొంతం చేసుకున్నాడు. అంతేకాక వైజాగ్, కృష్ణ మరియు నైజాం ప్రాంతాలలో ఈ సినిమాని సొంతంగా రిలీజ్ చేయనున్నాడు. ఈ ‘పటాస్’ సినిమా డిసెంబర్ లో విడుదలకు సన్నాహాలు చేసినా నందమూరి జానకిరామ్ అకాల మరణం వలన వాయిదాపడింది

కొత్త దర్శకుడు అనీల్ రావిపూడి సారధ్యంలో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా పటాస్ మనముందుకు రానుంది. కళ్యాణ్ రామ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. శృతి సోధి హీరోయిన్. ఈ సినిమాను తమ సొంత నిర్మాణ సంస్థ ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ నుండే నిర్మించారు

ఇటీవలే విడుదల చేసిన ఈ సినిమా టీజర్ అందరినీ ఆకట్టుకుంది. ‘పటాస్’ వచ్చే ఏడాది జనవరి 9న విడుదలకానుంది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు