నాగ చైతన్య సినిమా హక్కుల్ని దక్కించుకున్న దిల్ రాజు

నాగ చైతన్య సినిమా హక్కుల్ని దక్కించుకున్న దిల్ రాజు

Published on Oct 25, 2016 6:40 PM IST

dill-raju
యంగ్ హీరో నాగ చైతన్య తాజా చిత్రం ‘ప్రేమమ్’ మంచి విజయం సాదించడంతో ఆయన ప్రాజెక్టులపై నిర్మాతల్లోనూ, డిస్ట్రిబ్యూటర్లలోనూ నమ్మకం బాగా పెరిగింది. ‘ప్రేమమ్’ లో చైతూ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను బాగా మెప్పించడంతో ఆయన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కే కాకుండా షూటింగ్ పూర్తై రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాలకు కూడ డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఆయన చేసిన సినిమాల్లో ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రం రిలీజ్ కి రెడీగా ఉంది.

ఈ చిత్రం యొక్క నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కైవసం చేసుకున్నాడు. ‘ప్రేమమ్’ తర్వాత చైతన్య క్రేజ్ బాగా పెరగడం, మార్కెట్ కూడా బాగుండటంతో ఈ సినిమాను డీలా రాజు కైవసం చేసుకున్నట్టు తెలుస్తోంది. తమిళ వర్షెన్ ఆలస్యం కారణంగా వాయిదాపడుతూ వచ్చిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ కు ‘ప్రేమమ్’ విజయం చాలా బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. గౌతమ్ మీనాను డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మంజిమా మొహన్ హీరోయిన్ గా నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు