చిరంజీవితో సినిమాకి రెడీగా ఉన్నానంటున్న దిల్ రాజు !

చిరంజీవితో సినిమాకి రెడీగా ఉన్నానంటున్న దిల్ రాజు !

Published on Jan 20, 2017 12:49 PM IST

dill-raju
సంక్రాంతి సినిమాల సందడిలో భారీ పోటీ నడుమ విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ‘శతమానంభవతి’ చిత్రం ఒక రకమైన ప్రత్యేకతను సొంతం చేసుకుంది. ముఖ్యంగా నిర్మాత దిల్ రాజు తన పక్కా ప్లానింగ్ ఎలా ఉంటుందో మరోసారి రుజువు చేశాడు. ఈ సక్సెస్ సందర్బంగా చేస్తున్న సక్సెస్ టూర్లో నిన్న ఆదోని పట్టణంలో పర్యటించిన చిత్ర బృందం ద్వారకా సినీ కాంప్లెక్స్ లోని వి సెల్యులార్ థియేటర్లను ప్రారంబించారు.

ఆ సందర్బంలో మాట్లాడిన దిల్ రాజు సినిమాని పేక్షకులు చాలా బాగా ఆదరిస్తున్నారు. చిరంజీవిగారు కూడా సినిమా చూసి చాలా బాగుందని అభినందించారు. నేను కూడా ఆయన ఇంటికి వెళ్లి కలిసి వచ్చాను. మంచి కథ దొరికితే ఆయనతో సినిమా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నారు. అలాగే ఈ సంవత్సరం ‘నేను లోకల్, ఫిదా’ అల్లు అర్జును ‘దువ్వాడ జగన్నాథం’ వంటి సినిమాలు రిలీజవుతున్నాయని, ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు