రిలీజ్‌కు పక్కాగా సిద్ధమవుతోన్న దిల్‌రాజు సినిమా!

రిలీజ్‌కు పక్కాగా సిద్ధమవుతోన్న దిల్‌రాజు సినిమా!

Published on Dec 6, 2016 6:14 PM IST

dill-raju
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఇటు స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూనే, అటు చిన్న సినిమాలను నిర్మించడమో, విడుదల చేయడమో చేస్తూ కూడా వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన ‘నాన్న, నేను, నా బాయ్‌ఫ్రెండ్స్’ అన్న ఓ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు సొంతం చేసుకొని పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా రేపు ఆడియో ఆవిష్కరణ వేడుక జరుపుకుంటుందని దిల్‌రాజు టీమ్ తెలిపింది.

డిసెంబర్ 8న సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేస్తామని, డిసెంబర్ 16న సినిమా విడుదలకు పక్కాగా సిద్ధమవుతుందని ఈ సందర్భంగా టీమ్ స్పష్టం చేసింది. భాస్కర్ బండి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌తో ఇప్పటికే మంచి అంచనాలు రేకెత్తించింది. ‘కుమారి 21F’తో సెన్సేషన్‌గా మారిపోయిన హెబ్బా పటేల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను బెక్కం వేణుగోపాల్ నిర్మించారు. రావు రమేష్ ఓ ప్రధాన పాత్రలో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు