నాగార్జున – నాగ చైతన్య ల సినిమాకి ప్లాన్ రెడీ అయింది !

నాగార్జున – నాగ చైతన్య ల సినిమాకి ప్లాన్ రెడీ అయింది !

Published on Jan 17, 2017 3:40 PM IST

naga-chaitanya-nagarjuna
‘సోగ్గాడే చిన్ని నాయనా, ఊపిరి’ వంటి భిన్నమైన సినిమాలతో నాగార్జున, ‘ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో’ లాంటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్లతో నాగ చైతన్య ఇద్దరూ ఫుల్ జోష్ మీదున్నారు. వీరిద్దరి కలయికలో ఒక సినిమా రూపొందుతుందని ఎప్పటి నుండో వార్తలు వినిపిస్తున్నాయి. నాగార్జున కూడా పలు సందర్భాల్లో సరైన కథ దొరికితే సినిమా తప్పకుండా చేస్తామని కూడా చెప్పారు. ఆ సమయం ఆసన్నమైనట్టే కనిపిస్తోంది. వీరిద్దరి కలయికలో సినిమాకి ప్లాన్ సిద్దమవుతోంది.

ఇటీవల విడుదలైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘శతమానం భవతి’ తో దర్శకుడిగా తన అందమైన అభిరుచిని, డీసెంట్ మేకింగ్ స్టైల్ ను నిరూపించుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తారని కూడా తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుంది, ఇతర నటీనటులెవరు, కథ ఎలా ఉండబోతోంది అనే విషయాలపై ఇంకా అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు