పవన్ – త్రివిక్రమ్‌ కాంబినేషన్‌నే ప్రయత్నిస్తున్నా : దిల్‌రాజు

పవన్ – త్రివిక్రమ్‌ కాంబినేషన్‌నే ప్రయత్నిస్తున్నా : దిల్‌రాజు

Published on Jun 26, 2016 9:50 AM IST

DIL-RAJU
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, మాటలతో మ్యాజిక్ చేసే దర్శకుడు త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో ఓ సినిమా కొద్దిరోజుల క్రితమే అనౌన్స్ అయిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీలోని ఓ టాప్ నిర్మాత, దర్శకుడు కలిసి చేయనున్న సినిమా కావడంతో ఈ కాంబినేషన్‌పై అనౌన్స్ అయినరోజునుంచే అంచనాలు బయలుదేరాయి. ఇక ఈ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తారన్నది మాత్రం ఇప్పటికీ సస్పెన్సే. ఓ స్టార్ హీరోతోనే తమ సినిమా ఉంటుందని ప్రకటించిన దిల్‌రాజు, ఆ స్టార్ హీరో ఎవరన్నది మాత్రం ప్రకటించలేదు.

ఇక తాజాగా త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమా గురించి మాట్లాడుతూ దిల్‌రాజు ఓ ఆసక్తికర విషయం తెలిపారు. “త్రివిక్రమ్‌తో సినిమాకు రంగం సిద్ధమవుతోంది. త్రివిక్రమ్ ఏ హీరోతో సినిమా చేయాలనుకుంటూన్నాడో నాకు ఇంకా తెలియదు. నేనైతే పవన్ కళ్యాణ్‌తోనే ఈ సినిమా ఉండేలా ప్లాన్ చేస్తున్నా. త్రివిక్రమ్ దగ్గర ఇప్పటికే పవన్ కళ్యాణ్‌ గారికి ఒక స్క్రిప్ట్ రెడీగా ఉంది. త్వరలోనే ఈ సినిమా ప్రోగ్రెస్ ఏంటనేది తెలియజేస్తా” అన్నారు. పవన్ కళ్యాణ్ కుదరకపోతే ఇదే కాంబినేషన్‌లో రామ్ చరణ్ హీరోగా సినిమా తెరకెక్కే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు