తన అనారోగ్యం పై పుకార్లను ఖండించిన డిస్కో శాంతి

తన అనారోగ్యం పై పుకార్లను ఖండించిన డిస్కో శాంతి

Published on Nov 26, 2014 2:45 AM IST

Disco-Shanti12
డిస్కో శాంతికి ఆరోగ్యం అస్సలు బాలేదని, తన భర్త మరణం ఆమెను కలవరపరిచిందని మీడియాలో లెక్కలేనన్ని పుకార్లు వినిపించాయి. ఇటీవలే ఆమె చికిత్స కోసం సింగపూర్ వెళ్ళినట్టు సైతం వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తలన్నీ కేవలం పుకార్లే అని డిస్కో శాంతి కొట్టిపారేశారు. తాను ఆరోగ్యంగానే వున్నానని, ఈ వార్తలు వినిపిస్తున్న సమయంలో ఆమె చెన్నైలో తన సోదరి ఇంట్లో వున్నట్టు తెలిపారు

ఇకపై ఇటువంటి గాలివాతలను ప్రచారం చెయ్యవద్దని మీడియాకి తెలిపారు. శ్రీ హరి అభిమానులను కంగారుపడవద్దని సైతం చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు