డీజే మలయాళంలో విడుదలయ్యేది ఎప్పుడంటే..!
Published on Jul 1, 2017 3:35 pm IST


అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథమ్ చిత్రం విడుదలైన తరువాత మిక్స్డ్ టాక్ తో ప్రారంభమైంది. కానీ ఈచిత్ర వసూళ్లపై మాత్రం ఆ ప్రభావం పడలేదు. డీజే చిత్రం 100 కోట్ల గ్రాస్ ని రాబట్టినట్లు తెలుస్తోంది.

కాగా ఈ చిత్రం మలయాళంలో కూడా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. అల్లు అర్జున్ కు మలయాళంలో మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. జులై 14 న ఈ చిత్రం మలయాళంలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. మలయాళంలో ఈ చిత్రం ఏ స్థాయి విజయం సాధిస్తుందో చూడాల్సి ఉంది. పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది.

 
Like us on Facebook