యూట్యూబ్ ను ఊపేస్తోన్న ‘జగన్నాథం’ !


అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘దువ్వాడ జగన్నాథం’ ట్రైలర్ నిన్న సాయంతరం 7 గంటల 30 నిముషాలకు విడుదలైంది. రిలీజైన మరుక్షణమే సోషల్ మీడియాలో నెం.1 పొజిషన్ కు చేరుకున్న ఈ ట్రైలర్ యూట్యూబ్ లో అయితే సంచలనం సృష్టిస్తోంది. మొదటి నాలుగు గంటల్లోనే 4 మిలియన్ల్స్ వ్యూస్ దక్కించుకున్న ఈ ట్రైలర్ ప్రస్తుతం 2. 5 మిలియన్ల వ్యూస్, 90,000 లకు పైగా లైక్స్ తో దూసుకుపోతోంది.

బ్రాహ్మణుడు దువ్వాడ జగన్నాథంగా, స్టైలిష్ డీజేగా బన్నీ లుక్స్ అదుర్స్ అనిపిస్తే ఆయన చెప్పిన ‘పబ్బుల్లో వాయించే డీజే కాదు.. పగిలిపోయేలా వాయించే డీజే’ వంటి పవర్ ఫుల్ పంచ్ డైలాగులు అభిమానులకు, ప్రేక్షకులకు మంచి కిక్ ఇవ్వడంతో పాటు సినిమాపై క్యూరియాసిటీని ఇంకాస్త పెంచేశాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రాన్ని జూన్ 23న భారీ ఎత్తున విడుదలచేయనున్నారు.

 

Like us on Facebook