‘దోచేయ్’ ఆడియో రిలీజ్ ఎప్పుడు?

‘దోచేయ్’ ఆడియో రిలీజ్ ఎప్పుడు?

Published on Apr 2, 2015 8:12 AM IST

Dochey
‘స్వామిరారా’ వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని మనకందించిన దర్శకుడు సుధీర్ వర్మ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘దోచేయ్’ . నాగచైతన్య హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో అతని సరసన కృతిసనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమా షూటింగ్ కూడా పూర్తి కావచ్చింది. ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 17నేవిడుదల చేయాలనుకున్నా ప్రస్తుతం విడుదల తేదీని ఏప్రిల్ 24కు మార్చేశారు. సన్నాఫ్ సత్యమూర్తికి, ఈ సినిమాకు మధ్యన రెండు వారాల గ్యాప్ ఉంటే థియేటర్ల ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక సినిమా విడుదల తేదీ వాయిదా పడడంతో ఆడియో రిలీజ్ వేడుకనూ వాయిదా వేశారు. ఈ సినిమా ఆడియో వేడుకను చాలా కొత్తగా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. మార్చి 28 నుంచి ఏప్రిల్ రెండు వరకూ ఒక్కో రోజు ఒక్కో పాటను విడుదల చేస్తూ ఆ తర్వాతి రోజు (ఏప్రిల్ 3) ఆడియో విడుదల చేయాలనుకున్నారు. ఇప్పటికే నాలుగు పాటలు విడుదల అయ్యాయి కూడా. ఇక ప్రస్తుతం కొత్త పాటేదీ విడుదల చేయట్లేదు. ఏప్రిల్ రెండో వారంలో ఈ సినిమా ఆడియోను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 11నగానీ, లేదా 12న గానీ ఈ వేడుకను నిర్వహించే సూచనలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు