షార్ట్ రన్ టైం ‘దోచేయ్’కి హెల్ప్ అవుతుందా.?

షార్ట్ రన్ టైం ‘దోచేయ్’కి హెల్ప్ అవుతుందా.?

Published on Apr 21, 2015 4:41 PM IST

Dochey
యంగ్ హీరో అక్కినేని నాగ చైతబ్న్య నటించిన క్రైమ్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘దోచేయ్’. ‘స్వామి రారా’ ఫేం సుదీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమా రన్ టైం కూడా లాక్ చేసారు. ఫైనల్ గా 138 నిమిషాల సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ మధ్య కాలంలో తక్కువ రన్ టైం అనేది సినిమాకి చాలా హెల్ప్ అవుతోంది.

సుదీర్ వర్మ తన మొదటి సినిమా విషయంలో కూడా ఇదే ఫాలో అయ్యాడు. స్వామి రారాని తక్కువ రన్ టైంలో చెప్పడం వలన ఆ సినిమా సక్సెస్ కి అదో పెద్ద ప్లస్ అయ్యింది. ఇప్పుడు అదే ఫార్ములాని దోచేయ్ కి కూడా ఫాలో అయ్యాడు. మరి ఈ సినిమాకి ఈ తక్కువ రన్ టైం ఎంతవరకూ హెల్ప్ అవుతుందనేది తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే. నాగ చైతన్య సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి సన్నీ ఎం.ఆర్ మ్యూజిక్ అందించాడు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాతో తెలుగు సినిమాకి ఒక డిఫరెంట్ సినిమాని అందించడమే కాకుండా, కచ్చితంగా సక్సెస్ కూడా అందుకుంటామని ఈ చిత్ర టీం ఎంతో నమ్మకంగా ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు