ఇంటర్వ్యూ: కిషోర్ కుమార్ పార్థసాని – కళ్యాణ్ గారితో ఇంకాస్త ఎక్కువ జర్నీ చేయాలనిపిస్తుంది !

ఇంటర్వ్యూ: కిషోర్ కుమార్ పార్థసాని – కళ్యాణ్ గారితో ఇంకాస్త ఎక్కువ జర్నీ చేయాలనిపిస్తుంది !

Published on Mar 27, 2017 1:25 PM IST


‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ తో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కిషోర్ కుమార్ పార్థసాని (డాలి) ఆ తర్వాత వెంకటేష్ – పవన్ కళ్యాణ్ ల కాంబోలో ‘గోపాల గోపాల’ తెరకెక్కించి అందరి దృష్టినీ ఆకర్షించి ప్రస్తుతం పవన్ తో ‘కాటమరాయుడు’ ను రూపొందించి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. ఈ చిత్రం గత శుక్రవారం విడుదలై మంచి స్పందన తెచ్చుకున్న సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు కోసం..

ప్ర) సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయ్ ?
జ) శుక్రవారం రోజు ఓపెనింగ్స్ చాలా గొప్పగా వచ్చాయ్. కానీ శనివారం మార్నింగ్ షో కాస్త తగ్గినట్టు అనిపించాయ్. నెలాఖరు కావడం, ఇంకా టెన్త్ ఎగ్జామ్స్ పూర్తికాకపోవడం అందుకు కారణం. మళ్ళీ ఆదివారం రోజు మంచి కలెక్షన్స్ వచ్చాయి.

ప్ర) ఈ సినిమా లోకి మీరెలా వచ్చారు ?
జ) ‘గోపాల గోపాల’ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలని అనుకున్నాను. అయన కూడా ఒప్పుకుని స్క్రిప్ట్ రెడీ చేసుకోమన్నారు. అలా నేను ఈ ప్రాజెక్టులోకి రావడం జరిగింది. ‘వీరమ్’ సినిమాలో ప్రేమని ఎలివేట్ చేసే ఒక మంచి పాయింట్ ఉందని అనిపించింది. అందుకే ఆ సినిమా చేద్దామని ఆయనకు చెప్పగానే ఓకే అన్నారు. తమిళంలో సెకండాఫ్లో లవ్ ట్రాక్ ఉంటే తెలుగులో మాత్రం ఫస్టాఫ్లోనే లవ్ యాంగిల్ తీసుకొచ్చాను. కథను చిన్న చిన్న మార్పులు చేశాం. అవన్నీ ఆయనకు నచ్చాయి.

ప్ర) మీరు రీమేక్ సినిమాలే చేయాలనుకున్నారా ?
జ) నేను రీమేక్ ఎప్పుడూ మక్కికి మక్కీ తెసేయను. నా సినిమాలూ ఏది చూసిన అర్థమవుతుంది. ఎక్కడో ఒకదగ్గరనుంచి మనకు ఒక ఇన్స్పిరేషన్ కావాలి. నా దగ్గరకు ఒక రీమేక్ తీసుకొచ్చి మక్కికి మక్కీ తీసేయమంటే నేను చేయను. అందులో నుండి ఒక ఇన్స్పిరేషన్ రావాలి. అప్పుడే చేస్తాను.

ప్ర) ఈ సినిమాలో ఎలాంటి చేంజెస్ చేశారు ?
జ) ఇందులో బేసిక్ లైన్ బాగుంటుంది. అందుకే అది తీసుకున్నాను. ఆ ట్రైన్ ఫైట్ అన్నీ బాగా డిజైన్ చేశారు. అందుకే వాటిని అలానే ఉంచాను. కానీ ఫస్టాఫ్ మొత్తం మార్చేశాం. ఒరిజినల్ వెర్షన్ నుండి కేవలం ఇన్స్పిరేషన్ మాత్రమే తీసుకున్నాం.

ప్ర) సెకండాఫ్ వీక్ అంటున్నారు. మీకేం అనిపించలేదా ?
జ) నేననుకోవడం సెకాండాఫ్లోనే కథ ఉంటుంది. ఫస్టాఫ్ అంతా ఎంటర్టైనింగానే ఉంటుంది. కథకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అవి వచ్చినప్పుడు సినిమా కాస్త ఆగుతుంది. కథలో ట్విస్ట్ కాస్త ఆలస్యంగానే రావాలి. అందుకే కథ రెండవ భాగంలో స్టార్ట్ అవుతుంది.

ప్ర) శ్రుతిహాసన్ సినిమాకు మైనస్ అంటున్నారు. మీరేమంటారు ?
జ) లేదు ఆమె సినిమాలో చాలా బాగా చేసింది. మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది.

ప్ర) పవన్ కళ్యాణ్ గారిని ఎలా హ్యాండిల్ చేశారు ?
జ) కథ మీద క్లారిటీ ఉంటే పెద్ద కష్టమేమీ ఉండదు. అది పవన్ కళ్యాణ్ అయినా సరే అమితాబ్ బచ్చన్ అయినా సరే. కథ క్లియర్ గా ఉండి, ఏ సీన్లు చేయాలో క్లారిటీ అంతా సాఫీగా సాగిపోతుంది.

ప్ర) పవన్ కళ్యాణ్ పాత్రకు ఎలాంటి ఫీడ్ బ్యాక్ వచ్చింది ?
జ) సినిమా చూసిన ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా కొత్తగా ఉందని, ఆయన నటన కూడా చాలా బాగుందని అంటున్నారు. ఇంతకూ ముందు సినిమాల్లో చూడని కొత్త పవన్ కళ్యాణ్ ను ఈ సినిమాలో చూశాం అన్నారు. నేను కూడా అదే అనుకుంటున్నాను. ముఖ్యంగా లవ్ సీన్లలో ఆయన నటన చాలా కొత్తగా ఉంది.

ప్ర) సినిమాలో మందు సాంగ్ పవన్ ఇమేజ్ ను డామేజ్ చేస్తుందని అనిపించలేదా ?
జ) ఇది చాలా కష్టమైన పని. ఒక ఐదుగురు అన్నదమ్ములు ఒంటరిగా ఉన్నప్పుడు మందే తాగుతారు. ఆ పాయింటే సినిమాలో ముందు ముందు మంచి కామెడీని పండించింది. కథ డిమాండ్ చేస్తే ఏం చేసినా తప్పులేదు.

ప్ర) పవన్ కళ్యాణ్ గారితో పనిచేయడం ఎలా ఉంది ?
జ) ఆయనతో పని చేయడం చాలా బాగుంటుంది. ఆయన కోపంగా ఉంటారని, సెట్లోంచి వెళ్ళిపోతారని నేను కూడా విన్నాను. కానీ అలాంటిదేమీ లేదు. ఆయనకు నచ్చిన సీన్స్ చెబితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆయనతో మాట్లాడితే చాలా విషయాలు చెబుతుంటారు. అలాంటి వ్యక్తితో ఇంకాస్త ఎక్కువ జర్నీ చేయాలని అనిపిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు