మంచు లక్ష్మీ ‘దొంగాట’ రిలీజ్ డేట్

మంచు లక్ష్మీ ‘దొంగాట’ రిలీజ్ డేట్

Published on Apr 26, 2015 9:49 AM IST

Dongata
మంచు వారమ్మాయి మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో నటిస్తూ, నిర్మిస్తున్న సినిమా ‘దొంగాట’. అడవి శేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మంచు లక్ష్మీ ఆన్ స్క్రీన్ ఒక స్టార్ హీరోయిన్ గా కనిపించనుంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ దొంగాటకి ‘యు/ఏ’ సర్టిఫికేట్ వచ్చింది. సెన్సార్ పూర్తవడంతో ఈ చిత్ర టీం రిలీజ్ డేట్ ని ఫైనల్ చేసారు. మంచు లక్ష్మీ అండ్ టీం ఈ సినిమాని మే 1న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇక సినిమా రిలీజ్ కి ఒక వారం మాత్రమే గ్యాప్ ఉండడం వలన నేటి నుంచే ఈ చిత్ర టీం జోరుగా ప్రమోషన్స్ చేయనున్నారు. ఈ సినిమా ద్వారా వంశీ కృష్ణ అనే కొత్త దర్శకుడు సినీ పరిశ్రమకు పరిచయం కానున్నాడు. క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బ్రహ్మానందం పాత్ర హైలైట్ కానుందని సమాచారం. అంతే కాకుండా తెలుగులోని పలువురు స్టార్ హీరోస్ అంతా కలిసి ఈ సినిమాలోని ఓ పాటలో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు