పులి గ్రాండ్ ఆడియో లాంచ్ కి సిద్దమైన దేవీశ్రీ

పులి గ్రాండ్ ఆడియో లాంచ్ కి సిద్దమైన దేవీశ్రీ

Published on Aug 2, 2015 2:41 PM IST

Devi_sri_prasad12
ఒక్క తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా సోప్పర్ హిట్ ఆల్బమ్స్ అందించి సౌత్ ఇండియన్ రాక్ స్టార్ గా మారిన దేవీశ్రీ ప్రసాద్ పుట్టిన రోజు నేడు. ఈ బర్త్ డే మ్యూజిక్ కంపోజర్ కి డబుల్ ట్రీట్ అని చెప్పాలి. ఎందుకు అంటే దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ‘పులి’ సినిమా ఆడియో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ పులి సినిమా కోసం దేవీశ్రీ 6 సూపర్బ్ సాంగ్స్ ని కంపోజ్ చేసాడు. ఇప్పటికే సోషల్ మీడియాలో రిలీజ్ అయిన ఈ సాంగ్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సాంగ్స్ ఇప్పటికే అభిమానుల్లో అంచనాలను పెంచేశాయి.

ఈ రోజు సాయంత్రం చెన్నైకి సమీపంలోని మహాబలిపురంలో ‘పులి’ ఆడియో లాంచ్ చాలా గ్రాండ్ గా జరగనుంది. తన ఆడియో లాంచ్ లో స్టేజ్ పై స్పెషల్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకునే దేవీశ్రీ ఈ రోజు కూడా పులి ఆడియోలో స్పెషల్ గా లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నాడు. ఇలయథలపథి విజయ్ హీరోగా శృతి హాసన్, హన్సిక హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో శ్రీదేవి, సుధీప్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ వేడుకకి ముఖ్య అతిధిగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హాజరయ్యే అవకాశం కూడా ఉంది. సోషియో ఫాంటసీ సినిమాగా వస్తున్న ఈ సినిమాకి చింబుదేవన్ డైరెక్టర్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు