ఫాషన్ ఫోటోగ్రాఫర్ గా మారిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్..!

ఫాషన్ ఫోటోగ్రాఫర్ గా మారిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్..!

Published on May 28, 2016 10:52 AM IST

devi-sri-prasad
దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు అయినా పాటలు కూడా రాస్తాడు అన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా స్టేజ్ ఎక్కాడంటే పాట పాడటం, డాన్సు చేయడమే కాకుండా అక్కడున్న అందరితో కూడా డాన్సు చేయిస్తాడన్న విషయం తెలిసిందే. ఇటీవల వచ్చిన ‘కుమారి 21F’ లో ‘బ్యాంకాక్ సాంగ్’ కి కొరియోగ్రాఫర్ గా పనిచేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి 150 వ సినిమాకు, బాలకృష్ణ 100 వ సినిమా సంగీతం అందిస్తున్న … ఇలా రెండు ప్రతిష్టాత్మక చిత్రాలకు ప్రస్తుతం సంగీత దర్శకుడిగా పనిచేస్తున్న దేవీ ప్రస్తుతం తనలోని ఇంకోకళని బయట పెట్టాడు.

అదేమిటంటే… ప్రస్తుతం అయన ఫాషన్ ఫోటోగ్రాఫర్ గా మారాడు. ఈ ఫోటోలు తీసింది ఎవరికో కాదు… ‘అందాల రాక్షసి’, ‘భలే భలే మగాడివోయ్’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలలో కథానాయికగా నటించి మెప్పించిన లావణ్య త్రిపాటి కి. ఈ ఫోటో షూట్ వీడియో చూసిన వారు దేవిశ్రీ ప్రసాద్ ఫోటోగ్రాఫర్ గా ప్రొఫెషనల్స్ ని మరిపించాడు అనిపిస్తుంది.

దేవిశ్రీ ప్రాసాద్ ఫోటో షూట్ చేసిన వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు