మహేష్ కోసం ఫేమస్ సింగర్ ని దించిన దేవీశ్రీ

మహేష్ కోసం ఫేమస్ సింగర్ ని దించిన దేవీశ్రీ

Published on Jul 6, 2015 11:19 AM IST

devi-sri-prasad
టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో యంగ్ తరంగ్ దేవీశ్రీ ప్రసాద్ ఒకరు. దేవీశ్రీ ప్రసాద్ ప్రతి ఇచ్నేమాలోనూ కొత్త కొత్త సింగర్స్ ని పరిచయం చేయడం లేదా బాగా ఫేమస్ అయిన పాప్ సింగర్స్ తో కొన్ని పాటలను పాడిస్తుంటాడు. తాజాగా దేవీశ్రీ ప్రసాద్ మహేష్ బాబు సినిమా కోసం తన ఫేవరైట్ సింగర్ అయిన రఘు దీక్షిత్ చేత ఓ పాత పాడించాడు. ఇండియాలో బాగా పాపులర్ అయిన ఫోక్ అండ్ ఫ్యూజన్ ఆర్టిస్ట్ రఘు దీక్షిత్. దేవీశ్రీ రఘు దీక్షిత్ ని ‘S/O సత్యమూర్తి’ సినిమాతో తెలుగులోకి తీసుకువచ్చాడు.

శ్రీమంతుడు అనేది ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్.. కానీ ఇందులో ఓ రాక్ సాంగ్ కి అవకాశం ఉండడంతో దేవీశ్రీ రఘు దీక్షిత్ చేత ఈ పాటని పాడించాడు. నిన్ననే ఈ సాంగ్ కి సంబందించిన పూర్తి రికార్డింగ్ పూర్తయ్యింది. అన్ని పాటల రికార్డింగ్ పూర్తి చేసిన దేవీశ్రీ త్వరలోనే రీ రికార్డింగ్ పనులు మొదలు పెట్టనున్నాడు. శ్రీమంతుడు మ్యూజిక్ జూలై 18న రిలీజ్ కానుంది. అలాగే మూవీని మహేష్ బర్త్ డే కానుకగా ఆగష్టు 7న రిలీజ్ చేయనున్నారు. మహేష్ బాబు సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి కొరటాల శివ డైరెక్టర్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు