ఇంటర్వ్యూ: పవన్ మల్లెల – ఈ సినిమాలో బాగా ఆకట్టుకునే అంశం ఎంటర్టైన్మెంట్ !

ఇంటర్వ్యూ: పవన్ మల్లెల – ఈ సినిమాలో బాగా ఆకట్టుకునే అంశం ఎంటర్టైన్మెంట్ !

Published on Nov 23, 2017 5:58 PM IST

నారా రోహిత్ హీరోగా రూపొందిన చిత్రం ‘బాలకృష్ణడు’ రేపు శుక్రవారం రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు పవన్ మల్లెల మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) సినిమా రిలీజ్ పట్ల టెంక్షన్ ఏమైనా ఉందా ?
జ) రిలీజ్ పట్ల కొద్దిగా టెంక్షన్ గానే ఉంది. ఎందుకంటే నిర్మాతలు నా స్నేహితులే, ఇది నా మొదటి సినిమా. అందరం కొత్తవాళ్లే. అందుకే టెంక్షన్.

ప్ర) మీ నైపథ్యం ఏంటి ?
జ) నేను పుట్టి పెరిగింది విజయవాడలో. తర్వాత చెన్నైలో ఇంజనీరింగ్, ఆస్ట్రేలియాలో ఫిల్మ్ కోర్స్ చేశాను. సినిమాలంటే చాలా ఇష్టం. ప్రపంచంలో సినిమా అనే దానికి హద్దులు ఉండవు. అందుకే దీన్ని ఎంచుకున్నాను.

ప్ర) మొదటిసినిమానే కమర్షియల్ సినిమా ఎందుకు చేస్తున్నారు ?
జ) ముందు ఒక లవ్ స్టోరీ రాసుకున్నాను. నాలుగేళ్లు దానిపై ట్రావెల్ చేశాను. కానీ వర్కవుట్ కాలేదు. అందుకే కమర్షియల్ ఎంటర్టైనర్ చేయాలని ఇది చేశాను.

ప్ర) సినిమా కథేమిటి ?
జ) ఫయాక్షన్ బ్యాక్ డ్రాప్లో ఉండబోయే సినిమా. సినిమా 2006లో మొదలవుతుంది. హీరోయిన్ ను భద్రత కోసం వాళ్ళ మేనత్త హైదరాబాద్లో ఉంచుతుంది. ఆమెకు దగ్గరైన హీరో ఆమెను ఇంటికి తీసుకెళ్లే ప్రాసెస్లో ఒక్కరోజు పాటు జరిగే కథే ఈ సినిమా. ఒక రోడ్ జర్నీలానే ఉంటుంది.

ప్ర) టైటిల్ కు జస్టిఫికేషన్ చేశారా ?
జ) అంటే హీరో క్యారెక్టర్ ను బట్టి టైటిల్ పెట్టాం. హీరో ఎప్పుడూ అల్లరి చేస్తూ, పక్కవాళ్ళను ఆటపట్టిస్తూ ఉంటాడు. పృథ్వికి, రోహిత్ కు మధ్య మంచి కామెడీ ట్రాక్ ఉంటుంది.

ప) ఈ సినిమా కోసమే ఆయన్ను తగ్గమన్నారా ?
జ) అంటే సిక్స్ ప్యాక్ కోసం తగ్గమని చెప్పలేదు. ‘సావిత్రి’ టైంలో ఆయనకు ఈ కథ చెప్పాను. అప్పట్లో ఆయన కొద్దిగా ఎక్కువ లావుగా ఉండేవారు. కొంచెం బరువు తగ్గితే డాన్సులు, ఫైట్స్ లో ఈజ్ ఉంటుందని చెప్పాను.

ప్ర) సినిమాలో బాగా ఆకట్టుకునే అంశం ?
జ) సినిమా చాలా ఎంటర్టైనింగా ఉంటుంది. మంచి ఫన్ దొరుకుతుంది. సినిమా ఒక దగ్గర మొదలై ఇంకో దగ్గర ముగుస్తుంది. సినిమా చూసిన వాళ్ళు హాయిగా నవ్వుకుంటారు. పాటలు కూడా చాలా బాగుంటాయి.

ప్ర) రెజినా పాత్ర ఎలా ఉంటుంది ?
జ) రెజినా, రోహిత్ జోడీకి ఇది మూడో సినిమా. అయినా ఇద్దరి జోడీ ఈ సినిమాలో కొత్తగా ఉంటుంది. ముఖ్యంగా వారి మధ్య రొమాంటిక్ ట్రాక్ బాగుంటుంది.

ప్ర) రమ్యకృష్ణగారి పాత్ర ఎలా ఉంటుంది ?
జ) ఇందులో ఆమె రాయలసీమ లేడీగా కనబడుతుంది. కొత్తవాళ్ళైతే ఎస్టాబ్లిష్మెంట్ అవసరం అదే రమ్యకృష్ణ అయితే పెద్దగా అవసరంలేదు. ఆమె చేస్తే సినిమాకు హెల్ప్ అవుతుందని అడిగాం. ఆమె కూడా కథ వినగానే ఒప్పేసుకున్నారు.

ప్ర) మణిశర్మగారి సంగీతం గురించి చెప్పండి ?
జ) మణిశర్మ సంగీతమంటే నాకు చాలా ఇష్టం. ఆయన చాలా కరెక్టుగా ఉంటారు. ఈ సినిమాకి కూడా మంచి సంగీతాన్ని ఇచ్చారు.

ప్ర) మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి ?
జ) (నవ్వుతూ) అందరూ చెప్పినట్టే కొన్ని కథలు రెడీగా ఉన్నాయి. ఏదైనా ఈ సినిమా ఫలితంపై ఆధారపడి ఉంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు