‘చిన్నవాడు..’ బాక్సాఫీస్ వద్ద నిలబడ్డాడు!
Published on Nov 20, 2016 10:04 am IST

ekkadiki-pothav
హ్యాట్రిక్ హిట్స్‌తో వచ్చిన జోరును ‘శంకరాభరణం’తో అందుకోలేకపోయిన నిఖిల్, తాజాగా చాలా జాగ్రత్తలు తీసుకొని, తనకు బాగా కలిసివచ్చిన ప్రయోగాన్నే నమ్ముకొని ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ అంటూ గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు. మొదట్నుంచీ విపరీతమైన ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా, అంతా అనుకున్నట్టుగానే సరికొత్త కాన్సెప్ట్‌తో, అదిరిపోయే కామెడీతో ప్రేక్షకులను కట్టిపడేసింది. 500, 1000 రూపాయల నోట్ల రద్దుతో దేశమంతా డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చిన ఈరోజుల్లోనూ ఎక్కడికి పోతావు చిన్నవాడా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‍గా నిలబడడం విశేషంగా చెప్పుకోవాలి.

మొదటిరోజే హిట్ టాక్ వచ్చేయడంతో రెండో రోజు కూడా కలెక్షన్స్ ఎక్కడా పడిపోకుండా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. నిఖిల్ టీమ్ ధైర్యంగా చేసిన సాహసానికి బాక్సాఫీస్ వద్ద అనూహ్యంగా మంచి స్పందన వస్తోంది. దీంతో గత రెండు వారాలుగా వెలవెలబోయిన సినీ పరిశ్రమకు ఈ సినిమా కొత్త ఉత్సాహం తీసుకొచ్చింది. ఆదివారం కలెక్షన్స్ ఇంకా బాగుంటాయని ట్రేడ్ అంచనా వేస్తోంది. నిఖిల్ కెరీర్లోనే అతిపెద్ద రిలీజ్‌గా నిలిచిన ఎక్కడికి పోతావు చిన్నవాడాను వీఐ ఆనంద్ తెరకెక్కించారు. నిఖిల్ సరసన నందిత శ్వేత, హెబ్బా పటేల్ హీరోయిన్లుగా నటించారు.

 
Like us on Facebook