నిఖిల్ సినిమాకి పెరిగిపోతున్న డిమాండ్ !

నిఖిల్ సినిమాకి పెరిగిపోతున్న డిమాండ్ !

Published on Dec 8, 2016 10:32 PM IST

nikhil
కరెన్సీ కొరత ఉన్న కూడా ధైర్యంగా విడుదలై ఘానా విజయం సాధించిన చిత్రం ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’. ఈ సినిమా సాధించిన విజయంతో అప్పటి దాకా సినిమా పూర్తై విడుదలకు వెనక్కు తగ్గిన సినిమాలు కూడా ధైర్యంగా రిలీజవుతున్నాయి. ఇప్పటికే దాదాపు రూ.20 కోట్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రం నిఖిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కథతో పాటు హర్రర్, కామెడీ కంటెంట్ పుష్కలంగా ఉండటం, నందిత శ్వేతా అద్భుత నటన ఈ సినిమా విజయానికి ముఖ్య కారణాలు. ఈ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం చూసిన ఇతర భాషల నటులు, నిర్మాతలు రీమేక్ రైట్స్ కోసం భారీగానే పోటీ పడుతున్నారు.

తమిళంలో యూగ్ హీరో జీవి ప్రకాష్ ఈ కథ తనకైతే సరిగ్గా సరిపోతుందని, ప్రేక్షకులకు కావలసిన అన్ని ఎంటర్టైన్మెంట్ అంశాలు ఇందులో ఉన్నాయని తమిళ రీమేక్ రైట్స్ కోసం భారీ మొత్తం వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆయనతో పాటే మరికొంత మంది కూడా ఈ హక్కుల కోసం పోటీ పడుతుండగా కన్నడ పరిశ్రమ నుండి కూడా మంచి ఆఫర్లే వస్తున్నాయి. ఇలా ఈ రీమేక్ హక్కులు, శాటిలైట్ హక్కులు అన్నీ కలుపుకుంటే ఈ సినిమా వసూళ్లు పాతిక కోట్లు దాటిపోయే అవకాశముంది. ఈ ఘన విజయంతో హీరో నిఖిల్, హీరోయిన్లు నందిత శ్వేతా, హెబ్బా పటేల్, డైరెక్టర్ విఐ ఆనంద్ కు మంచి మంచి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు