అందరూ మాట్లాడేది అల్లు అర్జున్ స్టైల్ గురించే

అందరూ మాట్లాడేది అల్లు అర్జున్ స్టైల్ గురించే

Published on Dec 12, 2019 4:02 PM IST

అందరి హీరోలకంటే అల్లు అర్జున్ లో ఉండే ప్రత్యేక లక్షణం స్టైల్ పరంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం. ప్రతి సినిమాలోనూ కథకి తగ్గట్టు తనని తాను కొత్త లుక్‌లో ప్రెజెంట్ చేసుకుంటూ ఉంటాడు. ఈసారి కూడా తన కొత్త చిత్రం ‘అల వైకుంఠపురము’లో కూడా కొత్తగా కనిపించే ప్రయత్నం చేశాడు బన్నీ. నిన్న విడుదలైన టీజర్ చూస్తే హెయిర్ స్టైల్ దగ్గర్నుండి, బాడీ లాంగ్వేజ్, డ్రెస్సింగ్, డైలాగ్ డెలివరీ ఇలా అన్ని ముఖ్యమైన అంశాల్లో ప్రత్యేకంగా కనిపిస్తున్నారాయన.

టీజర్ చూసిన ప్రేక్షకులు, అభిమానులు బన్నీ కొత్త స్టైల్ చాలా బాగుందని, తమకు నచ్చిందని అంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. ఇప్పటికే తమన్ సంగీతం అందించిన పాటలు బ్రహ్మాండమైన విజయం సాధించి సినిమాపై అంచనాల్ని పెంచగా టీజర్ వాటిని రెట్టింపు చేసిందనే అనాలి. హారిక, హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ డైరెక్ట్ చేయడం జరిగింది. ఇందులో పూజా హెగ్డే కథానాయకిగా సుశాంత్, జయరామ్, టబు, సముథిరఖని, నవదీప్, నివేత పేతురాజ్, సునీల్, మురళీ శర్మ పలు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకురానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు